క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

ఘనంగా నర్సుల దినోత్సవం

కొరుక్కుపేట: తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు . ప్రతీ సంవత్సరం నర్సులను గౌరవించే విధంగా చైన్నె అనకాపుత్తూరు మాజీ పేరెంట్‌ టీచర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏవీ కుమార్‌ నర్సుల దినోత్సవంను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చెంగల్‌ పట్టు ఆసుపత్రి నర్సులు హెడ్‌ అయిన ప్రియదర్శినిని శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఇందులో నర్సులు వి. భారతీ , శాంతి పాల్గొన్నారు.

ఇంట్లోకి చొరబడి

యువతిపై అత్యాచారం

అన్నానగర్‌: నైల్లె సమీపంలో తల్లిదండ్రులు లేకపోవడంతో, 26 ఏళ్ల మానసిక వికలాంగురాలైన యువతి తన సోదరుడి సంరక్షణలో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, పేట్టై తిరుప్పణి కరశల్కుళంకు చెందిన ఇసక్కిదురై (34) అనే వ్యక్తి మంగళవారం ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడు. సాయంత్రం సోదరుడు పని నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఘటన గురించి చెప్పింది. అనంతరం నైల్లె టౌన్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్‌స్పెక్టర్‌ రాజకుమారి కేసు నమోదు చేసి, ఇసక్కిదురైని అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఏడీఎంకే కార్యకర్త ఆత్మహత్య

అన్నానగర్‌: విల్లుపురం జిల్లాలోని పూత్తురుకి చెందిన అంబేత్‌ కుమార్‌ (46). ఇతను ఏడీఎంకే జిల్లా ప్రతినిధి. ఇతనికి లోకనాయకి అనే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పని చేస్తుండేవా డు. సోమవారం రాత్రి, అంబేత్‌ కుమార్‌ తిరు చిట్రంబళంలోని జంక్షన్‌ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్‌ కంపెనీకి వెళ్లి అక్కడే నిద్రపోయాడు. మంగళవారం ఉదయం, అంబేత్‌ కుమార్‌ తన సెల్‌ ఫోన్‌లో ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అక్కడే ఉన్న షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో అప్పులే ఇందుకు కారణ మని తేలింది.

ఫ్రిజ్‌ పడి బాలుడి మృతి

అన్నానగర్‌: ధర్మపురి జిల్లాలోని వేగలన్‌ కోట్టై గ్రామానికి చెందిన పూల వ్యాపారి చిన్నస్వామికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం అతని కుమారుడు శ్రీధర్‌ (5) ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ అనుకోకుండా అతనిపై పడింది. ఈ ఘటనతో శ్రీధర్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని రక్షించి, చికిత్స కోసం కరిమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అతడిని పరీక్షించగా, అతను అప్పటికే మరణించినట్లు ప్రక టించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

కొత్త హై స్పీడ్‌ ఏ3

ఎంఎఫ్‌డీ స్కానర్ల ఆవిష్కరణ

సాక్షి, చైన్నె : కొత్త హై స్పీడ్‌ ఏ3 కలర్‌ ఎఫ్‌ఎఫ్‌డీ , డాక్యుమెంట్‌ స్కానర్లను కానన్‌ ఇండియా ఆవిష్కరించింది.స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీటిని కానన్‌ ఇండి యా అధ్యక్షుడు తొషియాకి నోమురా, ఉపాధక్షుడు సి. సుకుమారన్‌లు ఆవిష్కరించారు. వీటి లోని అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించారు. ఇందులో సాంప్రదాయ లేజర్‌కు బదులుగా ఓఎల్‌ఈడీ ఎక్స్‌పోజర్‌ సిస్టమ్‌ను ఉప యోగించినట్టు తెలిపారు. హై స్పీడ్‌ ఏ 3 ఎంఎఫ్‌డీ స్కానర్లు అత్యంత స్పష్టమైన టెక్స్ట్‌, కలర్‌ అవుట్‌పుట్‌ను అందిస్తాయని తెలిపారు.నిమిషానికి గరిష్ఠంగా 50 పేజీల కలర్‌ అవుట్‌పుట్‌ను అందిస్తుందన్నారు. మారుతున్న వ్యా పార అవసరాలకు అనుగుణంగా ఉత్పాదకత ను పెంచే పరిష్కారాలను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కలర్‌ నాణ్యత, వేగం, స్థిరత్వం విషయంలో రాజీ పడకుండా ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

టెక్నాలజీతో కూడిన

అనుభవం లక్ష్యం

సాక్షి, చైన్నె : టెక్నాలజీతో కూడిన సరికొత్త అనుభవాన్ని వినియోగ దారులకు అందించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అమెజాన్‌ ఇండియా ప్రతినిధులు స్థానికంగా ప్రకటించారు.గ్రేట్‌ సమ్మర్‌ 2026 వేడుక ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభమైందన్నారు. స్మార్ట్‌ షాపింగ్‌, భారీ డిస్కౌంట్లు , వేగవంతమైన డెలివరీలతో వినియోగ దారులను ఆకట్టుకుంటున్నామని వివరించారు. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఏసీలు, ఫ్యాష న్‌ , నిత్యావసర వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా రుఫూస్‌ ఏఐ షాపింగ్‌ అసిస్టెంట్‌ వినియోగ దారులకు మరింత తోడ్పాటుగా నిలుస్తున్నట్టు వివరించారు. అమెజాన్‌ బజార్‌, ఫ్రెష్‌ ద్వారా ప్రత్యేక రాయితీలు, అమెజాన్‌ పే ద్వారా ట్రావెల్‌ బుకింగ్స్‌పై కూడా డిస్కౌంట్లు సైతం కల్పిస్తున్నమని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement