సాక్షి, చైన్నె : సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన రామ్‌రాజ్ కాటన్ చైన్నెలో తన రిటైల్ ఉనికి మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొలత్తూరులో రిటైల్ పుట్‌ప్రింట్‌ను విస్తరించింది. దీనిని ఆర్‌ఆర్ గ్రూప్ చైర్మన్ డి దురై మురుగన్, బాలాజీ డెక్కర్స్‌కు చెందిన మురళీ, సునీత దంపతులు దీనిని గురువారం ప్రీమియం కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన రామ్‌రాజ్ విస్తృత శ్రేణి సంప్రదాయ వస్త్రాలను ఇక్కడ కొలువు దీర్చారు. కార్యక్రమంలో తమిళనాడు ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి రవి, కొలత్తూరు సాండ్ ట్రక్ ఓనర్స్‌అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌వీ రమణన్ తదితరులు పాల్గొన్నారు. రామ్‌రాజ్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్ మాట్లాడుతూ, చైన్నెలోని కొలత్తూరులో తమ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు అత్మీయంగా ఆహ్వానించారని, సాంప్రదాయ దుస్తులు కుటుంబ వేడుకలు సంస్కృతికి దగ్గరగా ఎల్లప్పుడు విశ్వసిస్తామన్నారు.


