సాక్షి, చైన్నె: ప్రముఖ హెచ్‌ఆర్, వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ సీఐఈఎల్ హెచ్‌ఆర్ 2026 ఆర్థిక సంవత్సరంలో అద్భుత ఫలితాలను నమోదు చేసింది. 32 శాతం వృద్ధి నమోదుతో రూ. 2 వేల కోట్ల ఆదాయానికి చేరువైంది. గురువారం సీఐఈల్ హెచ్‌ఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కె పాండియరాజన్ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా కంపెనీ తన ప్రతిష్టాత్మక లక్ష్యంగా సీఐఈఎల్ 3.ఓ విజన్ 2030 రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. దీనిద్వారా 2030 నాటికి రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. ఏఐ–ఆధారిత వర్క్‌ఫోర్స్ పరివర్తనలో తన భవిష్యత్తు వృద్ధిని కేంద్రీకరించనున్నట్టు ఇందులో భాగంగా పీపుల్‌ఓఎస్ ఫ్రేమ్‌వర్క్ , జోంబాయ్.ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉద్యోగుల ఎంపిక నుండి అభివృద్ధి వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నట్టు వివరించారు. కేవలం 9 సంవత్సరాలలో రూ.1000 కోట్లను అందుకున్న తాము తాజాగా 2 వేల కోట్లకు చేరువయ్యామని పేర్కొన్నారు.


