సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికై న జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై న రవిశంకర్‌లకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభాపతి వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అలంకరించిన ఈ ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వారు అసెంబ్లీ సంప్రదాయాలను, గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు భిన్నంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షం ఎమ్మెల్యేల సంఖ్య కంటే, సభలో ఉన్న ఇతర పార్టీల (ప్రతిపక్షాలు) మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువగా ఉందని, ఇదే ప్రజల తీర్పు అని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాల గొంతుక
సభలో అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకు వాదనలు, ప్రజల సమస్యలు ఎక్కువగా వినిపించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువల ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ సభను నిష్పక్షపాతంగా నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తన సందేశంలో తెలిపారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశానికి స్టాలిన్ నిర్ణయించారు. అన్నా అరివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
అనర్హత వేటు వేయండి
● సేలం వెస్ట్ ఎమ్మెల్యే లక్ష్మణన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు
సాక్షి,చైన్నె: సేలం వెస్ట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థి ఎస్. లక్ష్మణన్ తన నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, అందుకే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి సి. మనో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. లక్ష్మణన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై పెండింగ్‌లో ఉన్న అవి నీతి , కట్ట పంచాయటీ (అక్రమ సెటిల్మెంట్లు) సంబంధిత శాఖాపరమైన విచారణల వివరా లను పూర్తిగా వెల్లడించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. తనపై జరిగిన దర్యాప్తులో ఆరోపణలు నిరూపించబడలేదు అని పేర్కొంటూ వచ్చిన ఒక ప్రభుత్వ నివేదికను ఆయన అక్రమంగా ఉపయోగించుకున్నారని, తద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ,ుు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని మనో తన పిటిషన్‌లో కోరారు. ఈ వ్య వహారంపై సమగ్ర విచారణ జరిపి, లక్ష్మణన్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు అవసరమై న చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో, వరుసగా ఎమ్మెల్యేల గెలుపుపై కోర్టు కేసులు ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూర్ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి వ్యతిరేకంగా హైకోర్టులో విచారణ జరుగుతుండటం గమనార్హం.
ప్రభుత్వ యంత్రాంగంలో
భారీ మార్పులు
● సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ
సాక్షి, చైన్నె: తమిళనాడులో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పలువురు కీలక ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ కొత్త ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాత్రి జారీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శిగా గత ప్రభుత్వంలో కొనసాగి, ఎన్నికల కమిషన్ పక్కన పెట్టడంతో సెలవుపై వెళ్లిన ఎన్. మురుగానందంకు స్థాన చలనం కల్పించారు. సెలవు ముగించుకుని తిరి గి వచ్చిన మురుగానందంను ’రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్న అముదా స్థానంలో ఆయన నియమితులయ్యారు. చైన్నె మెట్రో రైల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సిద్ధికీని అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న టి. ఉదయచంద్రన్ స్థానంలో సిద్ధికీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రీయ శిక్షా అభియాన్ , స్టేట్ ప్లానింగ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్. స్వర్ణను పర్యాటక, సాంస్క్కతిక , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. సహకార సంఘాల రిజి స్ట్రార్‌గా ఉన్న కె. నందకుమార్, ఇకపై తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త నియామ కాలు జరిగాయి. పాలనను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఒక తాత్కాలిక పోస్టును సృష్టించింది. తమిళనాడు సివిల్‌సప్ల య్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గాఉన్న అన్నాదురై నియమించారు. ప్రత్యేక పథకాల అమలు శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న వి. విష్ణును ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


