సదరన్‌ రైల్వేకు.. కొత్త చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ | - | Sakshi
Sakshi News home page

సదరన్‌ రైల్వేకు.. కొత్త చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

● ఎస్‌.ఎన్‌. నారాయణ్‌ నియామకం

కొరుక్కుపేట: సదరన్‌ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా ఎస్‌.ఎన్‌. నారాయణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకానికి ముందు, ఎస్‌.ఎన్‌. నారాయణ్‌ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు , పర్యాటక శాఖ సహాయ మంత్రి గారికి డిప్యుటేషన్‌పై ప్రైవేట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐ ఆర్‌ టి ఎస్‌) అధికారి అయిన ఎస్‌.ఎన్‌. నారాయణ్‌, ఇండియన్‌ రైల్వేస్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, కార్యాచరణ సామర్థ్యం, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ , పబ్లిక్‌ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. ఎస్‌.ఎన్‌. నారాయణ్‌ దక్షిణ రైల్వేలోని వివిధ డివిజన్లలోని ఆపరేషన్స్‌ అండ్‌ కమర్షియల్‌ విభాగాలలో పలు హోదాలలో పనిచేశారు. ఆ తర్వాత, ఆయన న్యూఢిల్లీకి డిప్యూటేషన్‌పై వెళ్లి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని బయోటెక్నాలజీ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా, గౌరవనీయ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు అండ్‌ పర్యాటక శాఖ సహాయ మంత్రికి ప్రైవేట్‌ సెక్రటరీగా పనిచేశారు. దక్షిణ రైల్వేలో తన పదవీకాలంలో, ఆయన తిరుచ్చి డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌, దక్షిణ రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌ సేఫ్టీ), చైన్నె , పాలక్కాడ్‌ డివిజన్లలో డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌, సేలం డివిజన్‌లో డివిజనల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వంటి పలు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించిన ఆయన భారతీయ రైల్వేకు చెందిన అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు విధానపరమైన కార్యక్రమాల అమలులో కూడా పాలుపంచుకున్నారు. ఎస్‌.ఎన్‌. నారాయణ్‌ కోయంబత్తూరులోని పి.ఎస్‌.జి కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. ఆయన స్థానంలో ఇంతకుముందు పనిచేసిన ఎం. సెంథమిల్‌ సెల్వన్‌, ఇప్పుడు రాయపురం లోకో షెడ్‌లో సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారని బుధవారం ఒక ప్రకటనలో సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఓం ప్రకాష్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement