‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్‌ ఫోకస్‌ | Tamil Nadu CM Vijay Focused On Amma Canteens | Sakshi
Sakshi News home page

‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్‌ ఫోకస్‌

May 18 2026 6:48 PM | Updated on May 18 2026 7:04 PM

Tamil Nadu CM Vijay Focused On  Amma Canteens

చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు.  తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్‌లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్‌ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. 

అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో  అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement