కొరుక్కుపేట: నిజాయితీ, నిబద్ధత ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు అందుకోవచ్చునని సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈమేరకు చైన్నె వానగరంలోని కె.ఎం. స్పెక్ట్రాలో రిఫా చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సు శనివారం విజయవంతంగా జరిగింది. రిఫా చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు యూనస్ సయ్యద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రిఫా అనేది ఒక లాభాపేక్ష లేని వ్యాపార నెట్‌వర్క్ అని భారతదేశంలోని 18 రాష్ట్రాలలో సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. సదస్సులో 500 మందికి పైగా వ్యాపారవేత్తలు, పది మందికి పైగా వక్తలు, మేధావులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు వాణిజ్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఐదు కంపెనీలకు రిఫా అవార్డులను ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు. గో బటన్స్ గ్రూప్ సీఈఓ ఉమర్ ముఖ్తార్, యూఈఎఫ్ అధ్యక్షుడు అహ్మద్‌బుహారి, జావద్ పాల్గొన్నారు.


