పువ్వుల్లో దాగున్న అందం | - | Sakshi
Sakshi News home page

పువ్వుల్లో దాగున్న అందం

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

తమిళసినిమా: పువ్వులు వికసించగానే పరిమళిస్తాయి. అలాంటి పువ్వుల చూడగానే మగువుల తలపులు వికసిస్తాయి. వాటిని తమ సిగలో దాల్చుకోవాలని తహతహలాడుతుంటారు.. పువ్వులకు, మగువులకు అంతగా అనుబంధం ఉంటుంది. మగువులకు చీరలెంత అందమో, పువ్వులు అంత అందాన్నిస్తాయి. ఇకపోతే మగువులను పువ్వులతో పోల్చుతారు. వారి మనసులు అంత సుకుమారమనే అలా పోలుస్తారు. పువ్వులను ఇష్టపడని సీ్త్ర ఉండదని చెప్పొచ్చు. నయనతారకు పువ్వులంటే చాలా ఇష్టం అనుకుంటా. దాన్ని ఇప్పుడు చేతల్లో చూపించారు. దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ భామ, జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ పాగా వేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరోసారి సల్మాన్‌ఖాన్‌కు జంటగా హిందీలో నటిస్తున్నారు. తమిళంలోనూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా ఈమె నటించిన మూక్కుత్తి అమ్మన్‌–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఏంచేసినా వార్తే అవుతుంది. ప్రచారంలో ఈమె స్టయిలే వేరుగా ఉంటుంది. ఎలాంటి అకేషన్‌ వచ్చినా ఫొటోలు తీసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. అలా ఇటీవల అందమైన పువ్వులు ఈమె కంటపడ్డాయి. అంటే వెంటనే ఆ పువ్వులను సృశించి, పరిమళాలను ఆస్వాదించడంతో సరిపెట్టుకోకుండా వాటితో రకరకాల భంగిమల్లో ఫొటోలను తీయించుకున్నారు. పువ్వుల మధ్యలో దాగి వాటి అందాల్లో అందంగా మారిపోయారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజాక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement