ఈగో రామన్‌లో రోబోశంకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఈగో రామన్‌లో రోబోశంకర్‌

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

తమిళసినిమా: ఉపాధ్యాయలు, విద్యార్థుల ఇతివృత్తంతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. కాగా అలాంటి విభిన్న కథాంఽశంతో రూపొందిన తాజా చిత్రం ఈగో రామన్‌. ఇది ఉపాద్యాయుడికి, విద్యార్థికి మధ్య మానసిక పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అసృతా ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.సుధ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గణేశన్‌ నాంజిముత్తు నిర్వహించారు. రోబోశంకర్‌ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో సిబి భువనచంద్రన్‌, కీర్తన కథానాయికలుగా నటించారు. కవిత రమేశ్‌, సప్పాణి మురళి, చరణ్‌రాజ్‌, లత ముఖ్యపాత్రలు పోషించారు. రెమన్‌ నాట్రిక్స్‌ పాటలు రాసి సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తన తల్లి కల నెరవేర్చడానికి ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాస్తాడన్నారు. అయితే ఆ ఉద్యోగం అతనికి రాకుండా ఆటంకం కలిగిస్తారన్నారు. దీంతో ఆ తరువాత పరిణామాలతో ఆ యువకుడికి , ఉపాధ్యాయుడికి మధ్య కోల్డ్‌ వార్‌ మొదలవుతుందన్నారు. ఈగో రామన్‌ చిత్రంలో నాలుగు చక్కని పాటలు ఉంటాయని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చి, కోవై పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 45 రోజులు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

తమిళసినిమా: మలయాళ ప్రముఖ నటుడు ఫాహత్‌ ఫాజిల్‌ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన హీరోగా, విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వివి ధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్‌ ఫాజిల్‌ తాజాగా తమిళంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పలువురు ప్రముఖ హీరోలతో చిత్రాలు చేస్తున్న ఈ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్‌తో షూటింగ్‌కు రెడీ అవడం ఈయన విధానం కావడం గమనార్హం. ఫాహద్‌ ఫాజిల్‌, దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ల రేర్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్‌ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చైన్నెలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్‌, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.

వేల్స్‌ ఫిలింస్‌లో ఫాహద్‌ ఫాజిల్‌

Advertisement
 
Advertisement
Advertisement