కొరుక్కుపేట: ఒక రోజులో దాదాపు 10 వేల కిలోల వ్యర్థాలను తొలగించి అమీత్ విశ్వవిద్యాలయం ప్రత్యేకతను చాటుకుంది. అమీత్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2025–26 వార్షిక మెగా కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుస్థిరతీరంకోసం 10 వేల చేతులు అనే నినాదంతో తిరువాన్మియూర్ నుంచి కోవలం వరకు ఉన్న తూర్పు తీర రహదారి(ఈసీఆర్) పొడవునా 10వేల కిలోల వ్యర్థాల తొలిగింపే లక్ష్యంగా వివిధ విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు, క్యాడెట్లు, ఎన్ ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ప్రిన్సిపల్స్, డీన్‌లు, డైరెక్టర్లు విభాధిపతులు , అధ్యాపక బృందాలు , బోధన, బోధనేతర సిబ్బంది సహా సుమారు 5 వేల మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కరోజులోనే దాదాపు 10 వేల కిలోల వ్యర్థాలను తొలగించడానికి తోడ్పాడ్డారు . ఈ సందర్భంగా వర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ జె. రామచంద్రన్ , అధ్యక్షులు డాక్టర్ ఆర్ రాజీవ్ రామచంద్రన్ , మేనేజింగ్ ట్రస్టీ సుశీల రామచంద్ర తదితరులు పాల్గొని మాట్లాడుతూ సముద్ర జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం, బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచడం, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు.


