తెలుగు భాషను పరిరక్షించుకుందాం | - | Sakshi
Sakshi News home page

తెలుగు భాషను పరిరక్షించుకుందాం

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కొరుక్కుపేట: మొగప్పేర్‌ తెలుగు కల్చరల్‌ అండ్‌ సోషల్‌ అసోసియేషన్‌ (ఎంటీసీఎస్‌ఏ) 13వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి అన్నానగర్‌లోని చిన్నస్వామి మ్యారేజ్‌ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు.. అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు, ప్రొఫెసర్‌ సి.ఎం.కె.రెడ్డి, ఎస్‌డీఏటీ మెంబర్‌ సెక్రటరీ జె.మేఘనాథరెడ్డి, మాజీ డీజీపీ ఆర్‌. శేఖర్‌, ఏఐటీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌.నందగోపాల్‌, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.వి. వీరభద్రరావు పాల్గొని ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈసందర్భంగా అధ్యక్షుడు డాక్టర్‌ గిరి హనుమంతరావు, ముఖ్యఅతిథులు ప్రసంగిస్తూ పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలుగు వారు తమ మూలాలను మర్చిపోకుండా, భాషా సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ముగప్పైర్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో 500 కుటుంబాలకు పైగా పాల్గొనడం ఇదే మొదటిసారి అని వారుకొనియాడారు. 10వ,12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉన్న ప్రతిభావంతులైన తెలుగు విద్యార్థులకు పురస్కారాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌.నిర్మల్‌చందర్‌, జాయింట్‌ సెక్రటరీలు ఢిల్లీబాబు, మోహన్‌నాయుడు; డిప్యూటీ సెక్రటరీలు ఇక్కుర్తి సురేష్‌బాబు, ఆర్‌జీ. సురేష్‌బాబు, కోశాధికారి వై.గిరి, జాయింట్‌ ట్రెజరర్‌ పి. రామజయండాక్టర్‌ కల్పన, గౌరవాధ్యక్షుడు టి.ఎం.కె.కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement