ప్రకటించిన ఐసీఎస్‌ఐ
సాక్షి, చైన్నె: కార్పొరేట్ గవర్నెన్స్, వృత్తిపరమైన నైపుణ్యాలు, పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) కీలక నిర్ణయాలను ప్రకటించింది. చైన్నె వేదికగా జరిగిన ఐసీఎస్‌ఐ సదస్సులో పలు నూతన కార్యక్రమాలు, అంతర్జాతీయ విద్యా ఒప్పందాలు సరికొత్త స్పెషలైజ్డ్ కోర్సులను ఐసీఎస్‌ఐ వెల్లడించింది.
చైన్నెలో తమిళనాడు స్టేట్ కాన్ఫరెన్స్
ఐసీఎస్‌ఐ సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చైన్నెలో రెండు రోజుల పాటు తమిళనాడు స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెటమార్ఫోసిస్ సెక్టార్ స్పెసిఫిక్ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సుకు ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి కార్పొరేట్ నిపుణులు, పరిశ్రమల అధిపతులు హాజరై వివిధ రంగాల గవర్నెన్స్ నిర్మాణాలపై ప్యానెల్ చర్చలు జరిపారు.
2047 నాటికి 1.5లక్షల కంపెనీ
సెక్రటరీల అవసరం
ఈ సదస్సులో ఐసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు సిఎస్ పవన్ జి.చందక్ మాట్లాడుతూ.. మారుతున్న నియంత్రణ నిబంధనల నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలకు దేశంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అదనంగా మరో 10,000 మంది కంపెనీ సెక్రటరీలు అవసరమని ఆయన పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటే, వచ్చే 2047 నాటికి దేశంలో సుమారు 1.5 లక్షల మంది సెక్రటరీలు అవసరమవుతారని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న 80,000 మంది కంపెనీ సెక్రటరీలలో దాదాపు 35,000 మంది మహిళా నిపుణులే ఉన్నారని, ఈ వృతిలో మహిళల భాగస్వామ్యం ఏటా పెరుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, జూన్ 13–14 తేదీల్లో పూణేలో 27వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీస్ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


