చిన్నప్పుడే లైంగికదాడికి గురయ్యా! | - | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడే లైంగికదాడికి గురయ్యా!

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

తమిళసినిమా: గాయని కెనీషాపై ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె రవిమోహన్‌ (జయంరవి)తో కలిసి తిరుగుతున్నారని ఆయన వివాహబంధం విడాకులకు కారణం ఈమేనని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెనీషా తాజాగా ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే బంధువులకు చెందిన వ్యక్తి కారణంగా లైంగికదాడికి గురయ్యాను. ఆ తీరని వ్యథ నుంచి బయటపడక ముందే 2013లో అమ్మను, 2017లో నాన్నను కోల్పోయాను. 18, 19 ఏళ్ల వయసులోనే నా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు నాకు వివాహ బంధం గురించి తెలియదు. వివాహానంతరం నా భర్త పైశాచికంగా కడుపుపై తన్నడం కారణంగానే నా కడుపులోని నాలుగు నెలల గర్భస్థ శిశువు మృతిచెందింది. ఆ తర్వాతే నన్ను నేను దృఢపరుచుకోవడం ప్రారంభించాను. అవును నేను క్లబ్‌లో డాన్స్‌ చేశాను. అందులో తప్పేముంది అందుకు నాకు రోజుకు రూ.500 ఇచ్చేవారు. అప్పట్లో అదే నాకు జీవనాధారంగా మారింది. అలాంటి నా గురించి తప్పుగా మాట్లాడే వారికి బుద్ధి లేదా అనే భావన కలుగుతుంది. నాకు నలుగురైదుగురు పిల్లలు ఉన్నారని, నేను ఆంటీని అని, తండ్రిని అనాథాశ్రమంలో చేర్చి రవిమోహన్‌తో తిరుగుతున్నానని ఏవేవో ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటి వారిని అడుగుతున్నాను మీకు కొంచమైనా బుద్ధి ఉందా? నేను, రవిమోహన్‌ మీ కళ్ల ముందే తిరుగుతున్నాం కదా మేమేదో విదేశాలకు వెళ్లిపోయినట్లు ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు? నన్ను కలిసినప్పుడు ఆయన మానసిక వేదనకు గురయ్యారు. దీంతో నేను ఆయనకు ఒక థెరపిస్టుగా కొన్ని సూచనలు చేశాను. అది మా మధ్య పరిచయంగా మారింది. గర్భ శిశువును పోగొట్టుకున్న నేను రవిమోహన్‌ కుటుంబాన్ని నాశనం చేస్తానా? దయచేసి ఇలాంటి ప్రచారాన్ని కట్టిపెట్టి, మీ పనులపై దృష్టి పెట్టండని కెనీషా హితవు పలికారు.

కెనీషా

Advertisement
 
Advertisement
Advertisement