క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

● మహిళా కళాశాల ఉద్యోగిని అరెస్ట్‌

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు

వచ్చే వారిని గౌరవించాలి

కొరుక్కుపేట: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వచ్చే వారిని గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ దినేష్‌ పొన్‌రాజ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఒక సర్కులర్‌ను జారీ చేశారు. అందులో ఆయన పేర్కోంటూ ప్రజలు సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు, సబ్‌–రిజిస్ట్రార్‌ గారి బల్ల ఎదుట సహాయక, జూనియర్‌ సహాయకుల బల్లలకు ఎదురుగా తప్పనిసరిగా కుర్చీలను అమర్చాలి ప్రతి అధికారి ముందు కనీసం రెండు కుర్చీలు ఉంచాలి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శాఖ పరిధిలోని 587 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సందర్శిస్తుంటారు. ఈ కార్యాలయాలలో నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు, సబ్‌–రిజిస్ట్రార్లు, సిబ్బంది ప్రజలను నిలబెట్టి వారితో మాట్లాడతారని ఫిర్యాదులు వచ్చాయి. ఉప–రికార్డర్లు కుర్చీలో కూర్చొని మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిలబెట్టి రికార్డ్‌ చేయించకూడదని ఆదేశించారు.

విదాశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

అన్నానగర్‌: విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి రూ.50 లక్షలు మోసం చేసిన ఒక మహిళా కళాశాల ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని చూలైమేడు ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగిన అన్నామ్మాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీకి, తమిళనాడులోని వివిధ జిల్లాలలో కళాశాలలు ఉన్నాయి. ఈ విషయమై, కాంచీపురం పూకడైచత్తిరం ప్రాంతంలో పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ శాఖలోని ఉద్యోగులు, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నామని, వారి ట్యూషన్‌ ఫీజులు చెల్లిస్తున్నామని చెప్పి, రూ.50 లక్షల వరకు మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులైన కళాశాల విద్యార్థులు ఈ విషయమై కాంచీపురం జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వపోలీసుల దర్యాప్తులో కళాశాలలో పనిచేస్తున్న చాముశ్రీ, విఘ్నేష్‌, పవన్‌, ఫ్రాంక్లిన్‌, సత్యకళ ఈ మోసంలో పాలుపంచుకున్నట్లు వెల్లడైంది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజులను కళాశాల ఖాతాలో జమ చేయకుండా, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, ఆ ఐదుగురూ కలిసి మొత్తం రూ. 50 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మహిళా ఉద్యోగిని చాముశ్రీని పొల్లాచిలో శుక్రవారం అరెస్టు చేశారు. కాంచీపురం కోర్టులో హాజరుపరిచారు. పరారీలో మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమెరికా పౌరుడి అరెస్ట్‌

కొరుక్కుపేట: ఆక్రమంగా ఓటు వేశారన్న నెపంతో చైన్నె విమానాశ్రయంలో ఓ అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో చాలా మంది ప్రవాస భారతీయులు అక్రమంగా ఓటు వేశారని ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. దీంతో భారత ఎన్నికల సంఘం విమానాశ్రయ పౌరసత్వ అధికారులకు సమాచారం అందించి, విమానాలలో ప్రయాణించే విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల వేలిముద్రలను పర్యవేక్షించాలని, ఒకవేళ వారి వేలిముద్రలపై ఓటింగ్‌ వేలిముద్రలు ఉంటే, వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌న్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఆమేరకు చైన్నె, మదురై విమానాశ్రయాలలో పౌరసత్వ అధికారులు నిర్వహించిన తనిఖీలలో, విదేశీ పౌరసత్వం కలిగిన 17 మంది భారతీయులు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. అనుమానితులను గుర్తించి, పోలీసులకు అప్పగించి, చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో శుక్రవారం రాత్రి 10 గంటలకు, చైన్నె నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌న్స్‌ విమానంలో వెళ్లేందుకు చైన్నెలోని కె. కె. నగర్‌కు చెందిన కిషోర్‌(64) విమానాశ్రయానికి వెళ్లారు. చైన్నెలోని విరుగంబాక్కం ప్రాంతంలో ఓటు వేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్‌ చేశారు.

శ్రీసిటీలో చిన్మయ అమృత మహోత్సవ్‌

శ్రీసిటీ (వరదయ్యపాళెం) : చిన్మయ మిషన్‌ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘చిన్మయ అమృత మహోత్సవ్‌’లో భాగంగా శ్రీసిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందు కోసం విచ్చేసిన చైన్నె – నార్త్‌ ఈస్ట్‌ చిన్మయ మిషన్‌ రెసిడెంట్‌ ఆచార్యులు స్వామి మిత్రానందకు శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. మిత్రానందతో పాటు కోయంబత్తూరులోని చిన్మయ ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ రెసిడెంట్‌ డైరెక్టర్‌ స్వామి అనుకూలానంద, కడప చిన్మయ మిషన్‌ అధ్యక్షుడు స్వామి తురియానంద, గుంటూరు – విశాఖపట్నం చిన్మయ మిషన్‌ ఇన్‌చార్జి స్వామి సువీరానందకు ఆయన ఆహ్వానం పలికారు. తమిళనాడు నుంచి ఆంధ్రలో ప్రవేశించిన చిన్మయ అమృత్‌ యాత్ర వాహనంలో ఏర్పాటు చేసిన స్వామి చిన్మయానందకు సంబంధించిన పవిత్ర వస్తువులు, జ్ఞాపికలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు స్వామి చిన్మయానంద జీవిత స్ఫూర్తిని పరిచయం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీమతి భువనేశ్వరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement