తిరుత్తణి: వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో తిరుత్తణిలో శనివారం ధర్నా చేపట్టారు. నీట్ రద్దు చేసి ప్లస్–2 మార్కుల మెరిట్ ఆధారంగా వైద్య విద్య ప్రవేశానికి అనుమతివ్వాలనే డిమాండ్ మేరకు ద్రవిడ కళగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షడు మణి ఆధ్వర్యంలో తిరుత్తణిలో ధర్నా చేపట్టారు. ఇందులో వీసీకే, సీపీఎమ్ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. ద్రవిడ కళగం రాష్ట్ర ప్రతినిధి పొదటూరు పువియరసు పాల్గొని ధర్నా ప్రారంభించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే నీట్ రద్దు చేయాలని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులు సైతం వైద్య విద్య అభ్యసించేందుకు వీలుగా వైద్య విద్య ప్రవేశానికి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మేరకు నినాదాలు చేసి ధర్నా చేపట్టారు. వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి, ద్రవిడ కళగం నేత రమేష్ సహా అనేక మంది పాల్గొన్నారు.


