ప్రశాంత్‌ పాండిరాజ్‌కు అది ఇష్టమే..! | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ పాండిరాజ్‌కు అది ఇష్టమే..!

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

తమిళసినిమా: బ్రూస్లీ చిత్రంతో దర్శకుడిగా పరిచయం ఆ తరువాత విళంగు అనే వెబ్‌ సిరీస్‌ తో సక్సెస్‌ పుల్‌ దర్శకుడి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్‌ పాండిరాజ్‌ ఇటీవల మామన్‌ చిత్రంతో మరో హిట్‌ కొట్టారు. కాగా తాజాగా హీరోగా అవతారమెత్తి వారెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించారు. ఈయన దర్శకుడు పాండిరాజ్‌ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా జీ 5 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌గా రూపొందిన వారెంట్‌ వెబ్‌ సిరీస్‌ ను శివన్‌ పిక్చర్స్‌, ఎస్‌.స్టూడియోస్‌ సంస్థల అధినేతలు ప్రశాంత్‌ పాండిరాజ్‌,నీ.విశాల్‌, పీఎం.ఆధీశ్వర్‌ కలిసి నటించారు. విఘ్నేష్‌ నటరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 22వ తేదీ నుంచి జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పాండిరాజ్‌ మాట్లాడుతూ తాను ప్రశాంత్‌ పాండిరాజ్‌ ను ఎంతగా ఆట పట్టించినా, ఎగతాళి చేసినా ఎంజాయ్‌ చేస్తాడన్నారు. తాను తిట్టినా అతనికి ఇష్టమేనన్నారు. ఏ పనినైనా శ్రమించే వ్యక్తి అని చెప్పారు. మామన్‌ చిత్రం తరువాత వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు చెప్పడంతో సంతోషంగా..ఆశీర్వదించానని చెప్పారు. తాను ఒక యాక్షన్‌ కథను రెడీ చేశానని, అందులో తాను నటిస్తానని ప్రశాంత్‌ పాండిరాజ్‌ అన్నాడరని చెప్పారు. అంత ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నటుడు కెవిన్‌, దర్శకుడు సుశీంద్రన్‌, రామ్‌ కుమార్‌ బాలకృష్ణన్‌, తమిళరసన్‌ పచ్థముత్తు, నిర్మాత మదన్‌, కేఎస్‌. వినీష్‌, నటుడు వైయాపురి,అరుళ్‌ దాస్‌, నటి కౌశల్య, మీనా, అరుళ్‌ జ్యోతి, చాయాదేవి, పూర్ణిమ రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement