సాక్షి, చైన్నె: ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల ఆరోగ్య శైలిని మార్చేందుకు చైన్నెలో ఓ వినూత్నమైన భాగస్వామ్యం కుదిరింది. ప్రముఖ హెల్త్‌కేర్ అండ్ వెల్‌నెస్ క్లినిక్ లివ్యా హబ్, ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్ బ్రాండ్ టీమ్ హై పెర్ఫార్మెనన్స్‌తో చేతులు కలిపింది. ఈ ఇరు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన లివ్యా అడ్వానన్స్‌డ్ మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రామ్ చైన్నెలో అధికారికంగా ప్రారంభించారు.
చైన్నెలోని ఆల్వార్‌పేటలో ఉన్న ‘లివ్యా క్యూర్ హబ్’ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ పరిచయ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, టాప్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ వి. శ్రవంతి, డాక్టర్ ఆశాలత శ్రీనివాసన్; లివ్యా క్యూర్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.కె.టి. రాజు, టీమ్ హై పెర్ఫార్మెనన్స్ వ్యవస్థాపకులు శ్రీ హరి ప్రసాద్ తదితరులు పాల్గొని ఈ సరికొత్త హెల్త్ ఇనిషియేటివ్‌ను ఆవిష్కరించారు. చైన్నె నగర చరిత్రలో ఒక వెల్‌నెస్ క్లినిక్, ఒక ఫిట్‌నెస్ బ్రాండ్‌తో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్‌ను తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు, ఫిట్ నెస్ బ్రాండ్స్ సంయుక్తంగా ఈ ట్రానన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్‌ను క్లినికల్‌గా డిజైన్ చేశారు. శరీరంలోని జీవక్రియలను పునరుద్ధరించడం, శక్తి సామర్థ్యాలను పెంచడం, స్థిరమైన పద్ధతిలో శరీర బరువును నియంత్రించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. 90 రోజుల సమగ్ర ప్యాకేజీలో అత్యాధునిక కతమైన రోగనిర్ధారణ పరీక్షలు,నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలు, నిరంతర వైద్య పర్యవేక్షణ ఇందులో ఉంటాయి.


