అవార్డులను సకాలంలో అందిస్తేనే..! | - | Sakshi
Sakshi News home page

అవార్డులను సకాలంలో అందిస్తేనే..!

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

తమిళసినిమా: ప్రైవేట్‌ మ్యూజికల్‌ వీడియోలను కూడా ఇప్పుడు చాలా గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. సంగీత ప్రియుల నుంచి అలాంటి ఆల్బమ్స్‌కు మంచి ఆదరణ లభిస్తుండటమే ఇందుకు కారణం. కాగా తాజాగా సైలెంట్‌ ఇన్‌ ప్లూయెన్సర్‌ పేరుతో అలాంటి కలర్‌ఫుల్‌ మ్యూజికల్‌ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషనన్స్‌ పతాకంపై బలరాం జె.బాలాజీ నిర్మించి నటించిన ఈ ఆల్బమ్‌లో ఆయనతో పాటూ నటి ఐకీ బెర్రీ, నృత్య దర్శకుడు దినేష్‌ నటించారు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి రాజా దర్శకత్వం వహించిన ఈ పాటకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. ఈ తరం యువతను ప్రతిబింబించే ఈ మ్యూజికల్‌ ఆల్బమ్‌కు దినేష్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు. దర్శకుడు పేరరసు, ఆర్వీ.ఉదయకుమార్‌, చరణ్‌, ఎస్‌.ఎళిల్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్మాత కుటుంబం ఆవిష్కరించిన ఈ వీడియో ఆల్బమ్‌ తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఈ ఆల్బమ్‌ హీరో బలరాం జె.బాలాజీ నటుడు విజయ్‌ వీరాభిమానినని చెప్పారన్నారు. ఎంజీఆర్‌ తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన నటుడు విజయ్‌ అని, ఆయన చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంజీఆర్‌, కరుణానిధి చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారన్నారు. ఆ తరువాత వారు సినీ పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. సినీ అవార్డుల ఈ ఏడాదిలో విడుదల అయిన చిత్రాలకు వచ్చే ఏడాది అందిస్తేనే ఆనందం కలుగుతుందన్నారు. అలా కాకుండా ఎప్పుడో 10 ఏళ్లకు ఇస్తే ఆ భావోద్రేకాలు కలగవన్నారు. ఈ ఆల్బమ్‌ హీరో బలరాం జె.బాలాజీ మాట్లాడుతూ తనకు పాఠశాల రోజుల నుంచి సినిమాలపై ఆసక్తి అని, అనివార్య కారణాల ఈ రంగంలో ఆలస్యంగా వచ్చానని చెప్పారు. తాను దళపతి విజయ్‌ వీరాభిమాని అని, ఈ ఆల్బమ్‌లో ఆయన స్టైల్‌, యాక్టింగ్‌ కనిపించడానికి అదీ ఒక కారణం అని పేర్కొన్నారు.

సైలెంట్‌ ఇన్‌ప్లూయెన్సర్‌ ఆల్భమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులు, యూనిట్‌ సభ్యులు

Advertisement
 
Advertisement
Advertisement