కొరుక్కుపేట: క్రీడాపోటీలు విద్యార్థుల్లో సజనాత్మకను పెంపొందింపజేయడమే కాకుండా ఉజ్వల భవిష్యత్ కి దోహదం చేస్తుందని తమిళనాడు రంజీ ట్రోఫీ మాజీ ప్లేయర్ సోమిశెట్టి సురేష్ పేర్కొన్నారు. తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ (టీఏవీఎం), గ్రేటర్ చైన్నె యూత్ వింగ్, అండ్ యువశక్తి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పెరంబూరు కేఆర్‌ఎం పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో చెస్, క్యారమ్స్ పోటీలు, వివాహ మాల, వైశ్య బజార్ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు వాసవీ మాతకు ప్రత్యేక ప్రార్థనతో ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకు సాగాయి. యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉమేష్ దయాళన్, కార్యదర్శి యశ్వంత్ కనిగెలుపుల పర్యవేక్షణలో మూడు కేటగిరీలుగా ఒలంపిక్స్ నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ పోటీల్లో 5 నుంచి సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 36 మంది విజేతలకు సోమిశెట్టి సురేష్, డాక్టర్ వసంతగౌరి, అజంతా డా.కనిగెలుపుల శంకర్‌రావు, వామ్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ. టీఏవీఎం చైర్మన్ కేకే త్రినాథ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి దయాళమ్ వాసుదేవన్, ఎ.బద్రినారాయణ మెమెంటోలు, పతకాలు అందజేసి అభినందించారు. కేఆర్‌ఎం పాఠశాలల సీఈఓ ఆర్‌జే భువనేష్, ఎన్‌ఆర్ చేతన్, లింగేష్, పి.హరిప్రియ, కె.జయకుమార్, తిరవళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల యూత్ వింగ్ టీమ్ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


