తమిళసినిమా: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, కామెడీ కింగ్ వడివేలు 25 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం బ్యాంగ్ బ్యాంగ్. కేఆర్‌జీ కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తీర్పుకు రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ రోడ్రిగస్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటుందని, త్వరలో చిత్రాన్ని తెరపైకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పారు. ఇందులో బబ్లూ పృథ్వీరాజ్ కీలకపాత్రను పోషించినట్లు, ఇది వైవిధ్య భరిత నేపథ్యంలో సాగే హర్రర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పటికే విధులైన టీజర్ టైటిల్‌కు దీక్ష నుంచి విశేష స్పందన వచ్చిందని చిత్రంలో ప్రభుదేవా, వడివేలు మాస్ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరలై చిత్రంపై ఆసక్తిని పెంచాయన్నారు. ఇకపోతే ప్రభుదేవా వడివేలు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించడంతో మంచి అంచనాలు నెలకొంటున్నాయన్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి హెచ్ సి. వేణు చాయాగ్రహణం అందించినట్లు చెప్పారు.


