ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఆర్‌బీనగర్ కాలనీలోని ఇష్టకార్య సిద్ధి అంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా సువర్చల సహిత హనుమాన్ కల్యాణం, హోమం, అభిషేకం, అలంకరణ, పల్లకీసేవ కార్యక్రమాలు వేదపండితులు జి.అంజనేయశర్మ, సతీష్‌పాండేలు ఆధ్వర్యంలో కొనసాగాయి. ఈకార్య క్రమానికి ఎమ్మెలే వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. భ క్తుల కోసం నిర్మించిన హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, తదితరులున్నారు.
నృత్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
స్థానిక కూచిపూడి కళా క్షేత్రం నృత్య విద్యార్థులు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం నిర్వహించిన కూచిపూడి నృత్య రూపకం అంశంలో పాల్గొన్నారు. విద్యార్థులు హర్షిత, రితిక, రసజ్ఞ, హస్విత, నందిని, ఆద్య, విశ్వశ్రీ లతో డ్యాన్స్ మాస్టర్ వంశీ ప్రతాప్ గౌడ్‌లు శుక్రవారం ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డిని కలిసి తమ ప్రతిభను వివరించారు. వారిని ఎమెల్యే అభినందించారు.


