హిందువులపై దాడులు గర్హనీయం
కామారెడ్డి అర్బన్ : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు గర్హనీయమని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువు హత్యను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. మతోన్మాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ దేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే సెక్యులరిస్ట్‌లు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడులకు వ్యతిరేకంగా హిందువులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆందోళనకు అయ్యప్ప స్వాములు మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ అశోక్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి, గోపాలకృష్ణ, బొడ్డు శంకర్, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, నాయకులు శ్రీకాంత్‌రావు, పాపారావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, పూల్లూరు సతీష్, రమేష్, విఫుల్‌జైన్, కార్యదర్శి అరవింద్, సాయికుమార్, అయ్యప్ప స్వాములు బండి నర్సింలు, శివకుమార్, ముప్పారపు ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు.


