
భూభారతిని సద్వినియోగం చేసుకోవాలి
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్: భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భూరతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలతోపాటు బాన్సువాడలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సదస్సులలో మాట్లాడారు. భూభారతి చట్టం గురించి వివరించారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నా రు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్‌కుమార్ పటేల్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ, ఏవో నవ్య, తహసీల్దార్లు సవాయిసింగ్, వరప్రసాద్, బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, నాయకులు రవీందర్‌రెడ్డి, రమేష్ యాదవ్, మల్లయ్యగారి ఆకాష్, నాగభూషణం గౌడ్, తోట రాజు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్