లక్ష్యం నెరవేరింది
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లాలో ఎంతో మంది యువకులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించారు. 2025 సంవత్సరంలో వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. ముఖ్యంగా గ్రూప్–1, 2, 3, 4 ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. అలాగే గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ స్టాఫ్ వంటి కొలువులు కొట్టారు. ఈ ఏడాదిలో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఆరు వందల పైచిలుకు ఉంటారని అంచనా. అలాగే ప్రైవేటు రంగంలోనూ వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో జిల్లాకు చెందిన యువత మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఇతర ప్రైవేటు సంస్థల్లో అనేక మంది ఉద్యోగాలు పొంది నవ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. జేఈఈ ద్వారా జాతీయ విద్యాసంస్థల్లో ఎందరో విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించారు. నీట్ ద్వారా మరెందరో విద్యార్థులు మెడిసిన్ సీట్లు పొందారు.
ఈ ఏడాది ఎందరో నిరుద్యోగుల లక్ష్యం నెరవేరింది. పట్టుబట్టి కొలువులు కొట్టిన వారెందరో ఉన్నారు. మరికొందరు ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసుకున్నారు.
– సాక్షి ప్రతినిధి,
కామారెడ్డి
2025లో కొలువులు
సాధించిన పలువురు
ఉన్నత చదువులకు బాటలు వేసుకున్న మరికొందరు..
లక్ష్యం నెరవేరింది


