ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ రెగ్యులర్ 1, 3, 5 సెమిస్టర్లు, డిగ్రీ 2, 4 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ ఫలితాలు విడుదలయ్యాయి. వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, తెలంగాణ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు ఎన్.రాములు, ఏ.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్: గొర్రెలు, మేకల కాపరులు సీజనల్ వ్యాధులపై కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి భాస్కరన్ సూచించారు. మంగళవారం మోడెగాం, మల్లుపేట్, భూంపల్లి గ్రామాల్లో నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకొకసారి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును వేయించాలన్నారు. ఈ మందును వేయడం వల్ల రోగ నిరోధక శక్తి, ఉత్పాదకత పెరుగుతుందన్నారు. మూడు గ్రామాల్లో 250 గొర్రెలు, 785 మేకలకు ఈ మందు వేశామన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రాంప్రసాద్, సర్పంచ్‌లు గౌడెల్లి గంగాధర్, ఆకారపు రమ మహేశ్‌రెడ్డి, గైని శ్రీనివాస్, ఉప సర్పంచ్‌లు హరీశ్, రాజయ్య, పిల్లి గంగమణి, పశు వైద్య సిబ్బంది మురళి, కాశీరెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
● వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ
నిజామాబాద్ అర్బన్: జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠీని జిల్లాకు కేటాయించారు. ఆమె 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్, ఇదివరకు పనిచేసిన కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్ పరిధిలోని అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వినయ్‌కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడం విశేషం. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆకస్మిక బదిలీ జరిగింది.
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల


