ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గాంధారి, వండ్రికల్ గ్రామాలను సందర్శించారు. మండల కేంద్రంలో రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. అనంతరం వండ్రికల్‌లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో సరదాగా మాట్లాడారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఇటుకలు, సిమెంట్ కొరత లేదన్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి దశల వారీగా బిల్లులు వస్తాయన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌వో మురళి, డీఆర్‌డీవో సురేందర్, హౌసింగ్ పీడీ గౌతమ్, గాంధారి తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డి ఏడీఏ సుధామాధురి, ఏవో రాజలింగం ఆర్‌ఐ ప్రదీప్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


