‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం కోసం తెల్లవారుజామునుంచే బారులు తీరారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హన్‌మాన్ వెంకటేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, విఠలేశ్వరస్వామి, చిన్నమల్లారెడ్డి, లింగాపూర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు, అడ్లూర్ రామాలతోపాటు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.


