చట్టాలపై అవగాహన అవసరం
మాచారెడ్డి: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. బుధవారం మాచారెడ్డిలో నిర్వహించిన న్యాయసదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెటుకోవద్దన్నారు. ఆడపిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై పోక్సో కేసులు నమోదవుతాయన్నారు. అంగవైకల్యంతో ఉన్న వారిని గౌరవించాలన్నా రు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు టీఎల్‌ఎం కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్‌రావు, మాచారెడ్డి హైస్కూల్ హెచ్‌ఎం వెంకటాచారి, ఐఆర్‌బీ మంజుల, ఫిజియోథెరపిస్ట్ నవీన్, సిబ్బంది నర్సింహాచారి, సందీప్, నరేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు కోసం ఆ పార్టీ జిల్లాలకు పరిశీలకులను నియమించింది. కామారెడ్డి జిల్లాకు నాగుల సత్యనారాయణగౌడ్, బాస వేణుగోపాల్‌యాదవ్‌లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు, పార్టీ నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాల అమలు గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పరిశీలకులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా పరిశీలకులుగా బల్మూరి వెంకట్, తిరుపతి నియమితులయ్యారు.
మహిళను కాపాడిన వారిని అభినందించిన ఎస్పీ
కామారెడ్డి క్రైం: ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన ఓ వ్యక్తిని, పట్టణ పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం అభినందించారు. ఈనెల 21 న జిల్లాకేంద్రానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు జయశంకర్ కాలనీ సమీపంలోని రైలు పట్టాలపై పడుకుంది. దీనిని గమనించిన దేవ కుమార్ అనే వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ నరసింహులు, హోంగార్డు వసంత్ ఆమెను కాపాడి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాచారం ఇచ్చిన దేవ కుమార్‌తో పాటు మహిళ ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఎస్పీ బుధవారం జిల్లా కార్యాలయంలో అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు.
నేడు మంత్రి జూపల్లి రాక
బాన్సువాడ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బాన్సువాడకు రానున్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొంటారని పేర్కొన్నారు. వేడుకలకు విజయవంతం చేయాల ని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
వచ్చేనెలలో
సప్లిమెంటరీ పరీక్షలు
కామారెడ్డి టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చేనెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్‌తో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల (2025–26) కోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ప్రమీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర అంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలబాలికలు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బా లబాలికలు 5 నుంచి 18 ఏళ్లలోపు వారై ఉండాలని జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం


