రైల్వే ప్రయాణికుల ప్రయాస
కామారెడ్డి టౌన్: ఆదర్శ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికే రైల్వే అధికారుల మాటలు కోట లు దాటుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు.
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.
తలుపులు తెరుచుకోని వాష్‌రూమ్‌లు
కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఒకటి, రెండో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వాష్‌రూమ్‌లు ఎప్పుడూ మూతపడే ఉంటున్నాయి. లోపల నిర్వహణ సరిగ్గా లేకపోవడమో లేదా సిబ్బంది నిర్లక్ష్యమో తెలియదు కానీ, అత్యవసర సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి రైళ్ల కోసం వేచి చూసే వారు మూత్రానికి, బహిర్భూమికి వెళ్లలేక.. ఎవరిని అడగాలో తెలియక అవస్థ పడుతున్నారు.
పట్టించుకోని రైల్వే అధికారులు
స్టేషన్‌లో ఇన్ని సమస్యలు తాండవిస్తున్నా.. ఇక్కడి అధికారులకు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే హ డావుడి చేసే సిబ్బంది, సాధారణ రోజుల్లో ప్రయాణికుల గోడును పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి, మూతపడిన వాష్‌రూమ్‌లను తక్షణమే తెరిపించాలని, మంచినీటి సౌకర్యం కల్పి ంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తీరని దాహార్తి
రైల్వే స్టేషన్‌లోని ఒకటి, రెండో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మంచినీటి కుళాయిలు అలంకార ప్రాయంగానే మారాయి. పైపుల్లో నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రయాణికుల దాహార్తి తీరడం లేదు. దాంతో బయట ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నీళ్ల బాటిళ్లు కొనే శక్తిలేని వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
కామారెడ్డి స్టేషన్‌లో అవస్థలు
అన్నీఇన్నీ కావు..
మహిళా ఇబ్బందులు పట్టేదెవరికి..?
ప్లాట్‌ఫామ్‌లపై మూతపడిన
వాష్‌రూమ్‌లు
చుక్కనీరు రాని కుళాయిలు
రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
రైల్వే ప్రయాణికుల ప్రయాస
రైల్వే ప్రయాణికుల ప్రయాస


