ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

Jan 11 2026 7:47 AM | Updated on Jan 11 2026 7:47 AM

ఎస్పీ

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు చాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌

నిజాంసాగర్‌(జుక్కల్‌): జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎలె మల్లికార్జున్‌ శనివారం ఎస్పీ రాజేశ్‌చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.

పోరు దీక్ష

విజయవంతం చేయాలి

కామారెడ్డి టౌన్‌: తెలంగాణ సాంస్కృతిక నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశా లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పా ర్క్‌ వద్ద నిర్వహించనున్న తెలంగాణ పోరు దీక్షను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాని కి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు సొంటెం సాయిలు ఆధ్వర్యంలో శనివా రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సా యిలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకా రుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, నిరుద్యోగ కళాకారులకు తక్షణమే ఉ ద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చే శారు. జిల్లాలోని కళాకారులందరూ ఐక్యంగా పోరు దీక్షలో పాల్గొనాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు బస్వాపూర్‌ దేవరాజ్‌, గౌరవ అధ్యక్షుడు రెడ్డి రాజయ్య, కోశాధికారి రాజలింగం, కిషన్‌, శ్రీనివాస్‌, ఎల్లయ్య, శంకర్‌ గౌడ్‌, వెంకన్న, శ్రీనివాస్‌, శ్యామ్‌, స్వామి, స్వప్న, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

తెలంగాణ రైతు సంఘం

కార్యవర్గం ఏర్పాటు

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దొడ్లి మోహన్‌, ప్రధాన కార్యదర్శిగా పి.దశరథ్‌, ఉపాధ్యక్షులుగా మోతిరామ్‌ నాయక్‌, సురేష్‌ గొండ, నర్సింలు, సహ కార్యదర్శులుగా ఉప్పల సాయిలు, మధు, బన్సీలాల్‌లతో పాటు మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దొడ్లి మోహన్‌ మాట్లాడుతూ.. రైతుల పక్షాన పోరాటాలు చేసి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకు చెందిన నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖిత్‌ పాల్గొని 51 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన నీతూను ఓడించింది. దీంతో నేషనల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచింది. జిల్లాకు చెందిన హుసాముద్దీన్‌ సైతం బాక్సింగ్‌ పోటీల్లో గెలుపొందారు.

ఊరెళితే జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌అర్బన్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఊరికి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డోర్స్‌కు లాకింగ్‌ సిస్టమ్‌ వినియోగించుకోవాలని, సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో పెట్టి పరిశీలించాలన్నారు. అపరిచితుల పట్ల నిఘా ఉంచాలని సూచించారు.

వారంలో 232

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

నిజామాబాద్‌అర్బన్‌: వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 232 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ. 22,40,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఆరుగురికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు
1
1/2

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు
2
2/2

ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement