‘గంగవరం’ సారథ్యంలో.. శతాధిక ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ!
ఊపిరి ఉన్నంత వరకు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దశాబ్దాల పాటు నిరాదరణకు గురైన ఆలయాలను అలాగే ఏళ్ల తరబడిగా పూజకు నోచుకోని ఆలయాలకు పునరుజ్జీవం కల్పి స్తూ, కొత్త ఆలయాల ప్రతిష్టాపనతో గంగవరం ఆంజనేయశర్మ భక్తుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. కామారెడ్డి జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వందకు పైగా ఆలయాల ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆయన సారథ్యం వహించారు. వేదపండితులైన ఆంజనేయశర్మ తండ్రి నారాయణశర్మ వెయ్యికిపైగా ఆలయాల ప్రతిష్టాపనలు చేశారు. ఆయన దగ్గరే ఆంజనేయశర్మ ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి వైదిక కార్యక్రమాల్లో శిక్షణ పొందారు. గురుకుల కళాశాల అధ్యాపకుడిగా పనిచేసిన ఆంజనేయశర్మ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి వేద పండితుడిగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కామారెడ్డి పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాలు, పొరుగు జిల్లాల్లోనూ ఆయన ఆలయాల ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన దగ్గర వేదాలు నేర్చుకున్న శిష్యులను వెంటేసుకుని ఆలయాల ప్రతిష్టాపనలు నిర్వహించడంతోపాటు ఆయా ఆలయాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల ఆయన దగ్గర వైదిక విద్య నేర్చుకున్న వారు పూజారులుగా పనిచేస్తున్నారు.
కామారెడ్డి పట్టణంతోపాటు అనేక ప్రాంతాల్లో పురాతన ఆలయాల పునర్నిర్మాణం, కొత్తగా నిర్మించిన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణపత్రిష్ట చేయడానికి గంగవరం ఆంజనేయశర్మ సా రథ్యం వహించారు. హౌజింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర మహా గణపతి ఆలయ నిర్మాణానికి కాలనీ వాసులతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ సఫలమై ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇప్పుడు తెలంగాణ కాణిపాకంగా పేర్కొంటున్నారు. శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ స్వామి, విధుశేఖర భారతీ తీర్థ స్వామి, అలాగే సచ్చిదానంద స్వామి, పరిపూర్ణానానంద స్వామి, మాధవానంద స్వామి ఈ ఆలయాన్ని సందర్శించారు. అలాగే తూర్పు హౌజింగ్ బోర్డు కాలనీలో శారదామాత ఆ లయాన్ని నిర్మించారు. అక్కడే ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని నెలకొల్పారు. ఆర్‌బీ నగర్‌లో పది అడు గుల ఆంజనేయస్వామి విగ్రహంతో గొప్ప ఆలయా న్ని నిర్మించారు. కామారెడ్డి పట్టణా నికి మూలమైన కోడూరు ఆంజనేయ స్వామి ఆలయం, దశాబ్దాలుగా నిరాదరణకు గురైన కిష్టమ్మ గుడులకు పూర్వ వైభవం తేవడానికి స్థానిక యువకులు, వివిధ వర్గా ల వారితో కలిసి ఆంజనేయశర్మ చేసిన ప్రయత్నా లు సఫలమయ్యాయి. కోడూరు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కిష్ట మ్మ గుడిని ఇప్పుడు శివకేశవాలయంగా పేర్కొంటున్నారు. పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్యనాథుని శనైశ్వరుని ఆల యం కూడా నిర్మితమైంది. పట్టణంలోని పలు కాలనీల్లో కొత్తగా నిర్మించిన ఆలయాలన్నింటికీ ఆంజనేయశర్మ ఆధ్వర్యంలోనే ప్రాణ్రప్రతిష్ఠాపన జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆయన సారథ్యంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి.
ధర్మబద్ధమైన జీవనం కొనసాగిస్తూ అందరూ అభివృద్ధిపథంలో నడవాలన్నదే నా ఆకాంక్ష. ధార్మిక దృష్టితో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణానికి దోహదపడుతున్నాం. ఎంతో మందికి వేదం నేర్పి, ఆలయా ల్లో అర్చకులుగా పనిచేసే అవకాశం కల్పించా ను. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులకు సే వ చేస్తూ, ధార్మిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ నేను చేస్తున్న ప్రయత్నాలకు నా స తీమణి విజయలక్ష్మి సహకరిస్తూ తోడ్పాటునందిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు సమాజ శ్రే యస్సు, ధార్మిక కార్యక్రమాల కోసం శ్రమిస్తా.
– గంగవరం ఆంజనేయశర్మ, వేదపండితులు
‘గంగవరం’ సారథ్యంలో.. శతాధిక ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ!


