బల్దియాల్లో విజయఢంకా మోగించాలి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల గులాబీ జెండా ఎగరాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నేత లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో నేతల తో శనివారం సమావేశమయ్యారు. రెండేళ్ల కాలంలో పట్టణాలు అభివృద్ధికి దూరమయ్యాయని, ప్రజలు ప్రభుత్వంపై విసగిపోయారని కేటీఆర్ పేర్కొన్నట్లు నేతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని అన్ని స్థానాలు కై వసం చేసుకునేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావ్ సైతం మాట్లాడారన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్‌సింధే, షకీల్, గణేశ్‌గుప్తా, నేతలు వీజీగౌడ్, ముజీబొద్దీన్, జుబేర్, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.


