కానరాని పరిష్కారం!
తిరస్కరణలే అధికమా!
కామారెడ్డి క్రైం: భూ సమస్యల పరిష్కారంలో అధి కారుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నా యి. దరఖాస్తులను దాదాపుగా పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. ధరణి కారణంగా రికార్డు ల్లో తలెత్తిన సమస్యలతో రైతులు నానా అవస్థలు ప డ్డారు. ఎన్నో ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిన ధరణిని రద్దు చేసి దాని స్థానంలో పరిష్కారాలు చూపే విధంగా ఆప్షన్‌లు కల్పిస్తూ ప్రస్తుత ప్ర భుత్వం భూ భారతిని తీసుకువచ్చింది. ఇక తమ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు భావించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పా టు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారాలను కేయించారు. దాదాపు ఏడాది కాలంగా దరఖాస్తుల పరిశీలన, పరిష్కారాలు ఆయా స్థాయిల్లో జరుగుతోంది. అధికారులు దాదాపు అన్ని సమస్యలను పరిష్కారించామని చెబుతున్నా చాలా మంది రైతులు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.
దాదాపు 40 వేల దరఖాస్తులు
భూ సమస్యల పరిష్కారం కోసం ఏడాది క్రితం భూ భారతి పేరుతో గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 40 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తులను 3 రకాలుగా విభజించారు. అందులో అసైన్‌మెంట్ భూములవి 10,748, సాదాబైనామా 11,455, ఇతర సమస్యలవి 17,426 ఉన్నాయి. అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావాల్సి ఉంది. వీటిపై అన్ని రకాల విచారణలు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. సాదాబైనామా కేసులపై ఇటీవలే కోర్టు అనుమతులు వచ్చాయి. దీంతో దరఖాస్తులను పరిష్కరించి పరిష్కరిస్తున్నారు. ఇతర భూ భారతి దరఖాస్తుల విషయానికి వస్తే రికార్డుల్లో రైతు పేరు, శివారు, అడ్రస్ తప్పులు లాంటి చిన్న చిన్న సవరణలకు తహసీల్దార్లకు, పలు రకాల ఇతర సమస్యలకు సమస్య తీవ్రతను బట్టి ఆర్డీవోలు, అదనపు కలెక్టర్, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారు.
మాది 5 ఎకరాల స్వంత ప ట్టా భూమి. ధరణిలో నిషేధిత భూముల జాబితాలో పడింది. ఆరేళ్లుగా కార్యాల యాల చుట్టూ తిరుగుతు న్నా. రెవెన్యూ సదస్సుల్లోనూ దరఖాస్తు చేసిన. ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
– బస్వంత్, బేగంపూర్, పెద్దకొడప్‌గల్ మండలం
ధరణి ప్రారంభం అయ్యాక కొత్త పాస్‌పుస్తకం వచ్చింది. ఆ వెంటనే దాదాపు ఎకరం భూమి ధరణిలో అటవీ భూమిగా చూపిస్తోంది. అనే క సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన. రెవెన్యూ స దస్సుల్లో కూడా దరఖాస్తు చేసిన. ఇంకా సరిచేయలేదు. – వంకాయల బల్‌రాం,
బేగంపూర్, పెద్ద కొడప్‌గల్ మండలం
ధరణి తెచ్చిన కష్టాలు
2016లో అప్పటి ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకువచ్చి రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్ చేసే ప్రక్రియను చేపట్టింది. రికార్డులను ఆన్‌లైన్ చేసే క్రమంలో అనేక తప్పిదాలు దొర్లాయి. రైతుల పేర్లు, శివారు, సర్వే నెంబర్, విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, ఇతర అనేక రకాల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అనేక మంది రైతుల భూములు నిషేధిత భూముల జాబితాలో, డమ్మీ ఖాతాల్లో పడ్డాయి. వాటిని పరిష్కరించేందుకు ధరణిలో ఆప్షన్‌లు అందుబాటులో లేక అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. పరిష్కారానికు అప్పటి ప్రభుత్వం అంతగా చొరవచూపలేదు. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చింది.
తహసీల్దార్ లాగిన్‌లలో దరఖాస్తుల పరిష్కారా లు చివరి దశకు చేరుకున్నాయని, దాదాపు 98 శాతం పూర్తి చేశామని రెవెన్యూ అధికారులు చె బుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే సమస్య లు ఇంకా పరిష్కారం అయినట్లు కనిపించడం లేదు. దీంతో అధికారులు చూపిస్తున్న పరిష్కారాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ద రఖాస్తుల పరిశీలనలో తిరస్కరించబడినవే ఎ క్కువగా ఉంటున్నాయనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. డివిజన్, జిల్లా స్థాయి లాగిన్‌లకు చేరి న అనేక దరఖాస్తులకు పరిష్కారాలు చూపా ల్సి ఉన్నట్లు తెలుస్తోంది. భూ భారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మొదటగా రెవెన్యూ సదస్సులు ర్పాటు చేసిన ఒక లింగంపేట మండలంలోనే భూ రికార్డులకు సంబంధించిన 4,500 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో సగమై నా పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. తిరస్కరించిన దరఖాస్తుల సంఖ్యను వె ల్లడించడానికి కూడా అధికారులు సుముఖత చూపడం లేదు. ప్రజావాణితోపాటు అన్ని మండల కార్యాలయాలకు నిత్యం రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం రావడం కనిపిస్తూనే ఉంది.
భూ సమస్యల పరిష్కారాలపై
అనేక సందేహాలు
తహసీల్దార్ లాగిన్‌లో చివరి దశకు చేరుకున్న దరఖాస్తులు
98 శాతం పూర్తి చేశామంటున్న రెవెన్యూ అధికారులు
తిరస్కరణకు గురైనవే ఎక్కువ
అనే విమర్శలు
కానరాని పరిష్కారం!
కానరాని పరిష్కారం!
కానరాని పరిష్కారం!


