కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

Apr 28 2025 12:46 AM | Updated on Apr 28 2025 12:46 AM

కూరగా

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

అంగళ్లకు ఇక్కడి నుంచే సరఫరా

లాభాలు గడిస్తున్న రైతులు

నస్రుల్లాబాద్‌ : సాధారణంగా ఏ గ్రామంలో అయి నా కొద్దిమంది మాత్రమే కూరగాయలు సాగు చే స్తుంటారు. కానీ అంకోల్‌ క్యాంప్‌లో మాత్రం ఊరుఊరంతా కూరగాయలు సాగు చేస్తుంది. అది కూ డా సేంద్రియ ఎరువులు వాడుతూ కూరగాయలు పండిస్తున్నారు. వీరు పండించిన కూరగాయలను బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, పిట్లం, బి చ్కుంద, నిజామాబాద్‌, బోధన్‌, కోటగిరి, సాలూ ర, సాటాపూర్‌, నవీపేట్‌, పొతంగల్‌, వర్ని, నారా యణ్‌ఖేడ్‌ తదితర ప్రాంతాల్లోని అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు.

అంకోల్‌ క్యాంప్‌లో మొత్తం 105 కుటుంబాలున్నాయి. సుమారు 60 కుటుంబాలు కూరగాయల ను సాగు చేస్తున్నాయి. సాధారణ పంటలతోపాటు దాదాపు 45 ఎకరాల్లో ఆయా రకాల కూరగాయలు పండిస్తున్నారు. బెండకాయ, క్యాబేజీ, మిర్చి, వంకాయ, టమాట, క్యాలీఫ్లవర్‌, సోరకాయ, బీరకా య, కాకరకాయలు ఎక్కువగా పండిస్తారు. రోజూ కూరగాయలు తెంపి, చుట్టు పక్కల గ్రామాల్లో నిర్వహించే అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తారు.

అతివలదే ప్రధాన పాత్ర..

కూరగాయల సాగులో మహిళలే క్రియాశీలక పాత్ర పోషిస్తుంటారు. విత్తనాలు విత్తడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పంట కోయడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. ఉదయం పంట కోసి బుట్టలు సిద్ధంగా ఉంచితే మగవారు వాటిని తీసుకెళ్లి అమ్ముకొని వస్తారు. కొందరు మహిళలు సైతం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తుంటారు.

అన్నీ నేనే చేస్తా..

అర ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తాం. మిగతాది వరి పండిస్తాం. పంట కోయడం, కలుపు తీయడం, నీరు పారించడం, మందులు చల్లడం వంటివి నేనే చేసుకుంటాను. మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటాను.

– శోభ, రైతు, అంకోల్‌ క్యాంపు

రెండెకరాల్లో కూరగాయలు

పండిస్తున్నా

ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం వరకు పొలంలోనే ఉంటా. కూరగాయలు మార్కెట్‌ వెళ్లగానే తినేసి వచ్చి పనులు చేసుకుంటాం. 2 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తాం.

– లక్ష్మి, రైతు, అంకోల్‌ క్యాంపు

మా కూరగాయల కోసం

ఎదురుచూస్తారు

మా ఊరి పంట బండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. చుట్టు పక్కల ఎక్కడ అంగడి ఉన్నా మా గ్రామం నుంచే కూరగాయలు పంపిస్తాం. శుభకార్యాలకు ప్రత్యేకంగా వచ్చి తీసుకెళతారు.

– సిద్దమ్మ, రైతు, అంకోల్‌ క్యాంపు

సంతోషంగా ఉంది

మా ఊరి రైతులు కూర గాయలే కాకుండా వరి పండించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల సాగు పను లన్నీ మహిళలే చూస్తా రు. కూరగాయల సాగుతో మా ఊరి రైతులు లాభాలు గడిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

–వెంకటరమణ, మాజీ సర్పంచ్‌, అంకోల్‌ క్యాంపు

● ఈమె పేరు చంద్రమ్మ. 73 ఏళ్లు. తనకున్న 1.05 గుంటల భూమిలో వరితోపాటు ఉల్లిగడ్డ, పాలకూర, టమాట, తోటకూర, మెంతికూర, కొత్తిమీర సాగుచేస్తోంది. తానే స్వయంగా పొలంలో పనులు చేస్తుంది. ఇద్దరు కూతుళ్లతోపాటు కొడుకు పెళ్లి చేసింది. కొడుకు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటుండగా, ఇద్దరు మనవళ్లతో పొలం పనులు చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌1
1/5

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌2
2/5

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌3
3/5

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌4
4/5

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌5
5/5

కూరగాయలు C/o అంకోల్‌ క్యాంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement