
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సీనియర్ హీరోయిన్ రంభ

రంభ అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది.

ఆమె నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ.

తర్వాతి కాలంలో ఆమె రంభగానే కంటిన్యూ అయిపోయింది.

తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది.

కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. వంటి ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది.

ఆమె నటించిన చివరి చిత్రం ద ఫిలింస్టార్ (2011లో వచ్చిన మలయాళ మూవీ).

2010లో బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది.

వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం.

వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె కెనడాలో సెటిలైంది.

చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
