ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఆయన లింగంపేట మండలంలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుంచే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రతి మండలం నుంచి 500 మందితో ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి 3వేల మందిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, విష్ణువర్దన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గన్నూనాయక్, శ్రీకాంత్, నర్సింలు, సురెందర్, ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సేవ్ ద గర్ల్స్ సొసైటీ తరపున
పెళ్లి సాయం అందజేత
రామారెడ్డి : రామారెడ్డికి చెందిన తల్లిదండ్రులను కోల్పొయిన భార్గవి అనే యువతి అనే వివాహానికి సేవ్ ద గర్ల్స్ సొసైటీ తరపున బుధవారం రూ.21 వేల ఆర్థిక సాయంను పెళ్లి కానుకగా అందజేశారు. సేవ్ ద గర్ల్స్ సొసైటీ సంస్థను చంచల్‌గుడా జైల్ సూపర్‌డెండెట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
బాలసదన్‌కు అనాథ విద్యార్థులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కస్తూ ర్భా గాంధీ పాఠశాలలో ఐదుగురు అనాథ విద్యార్థులు చదువుతున్నారు. వీరిని పాఠశాల సిబ్బంది కామారెడ్డిలోని బాలసదన్‌కు పంపించారు.


