మోడు వారిన పల్లె ప్రకృతి వనం
● ఎండిపోయిన చెట్లు..
కరువైన ఆహ్లాదం
● పట్టించుకోని అధికారులు
రాజంపేట(భిక్కనూరు): ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది. రాజంపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయానికి కూత వేటు దూరంలో పల్లె ప్రకృతి వనం ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి అంతటా పచ్చదనంతో కళకళ లాడుతుండగా.. ఈ ప్రకృతివనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పట్టించుకునేవారు లేక కొన్ని మొక్క లు, చెట్లు ఎండిపోగా.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరికొన్ని కాలిపోయాయి. అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి ఆహ్లాదక ర వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
మోడు వారిన పల్లె ప్రకృతి వనం


