దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను పూర్తిగా విస్మరిస్తోందని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిప్ప దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెన్షన్ పెంపు, ఉచిత రవాణా సౌకర్యం, ఉద్యోగాల భర్తీ తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఈశ్వర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ ఆత్మ కథనం ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, తెరసం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని సాహితీ అభిమానులు విజయవంతం చేయాలని తెరసం ప్రతినిధులు కోరారు.
భిక్కనూరు: వరంగల్‌లో జరుగనున్న ఏబీవీపీ సమ్మేళనానికి వెళ్తున్న విద్యార్థుల వాహనాలను సౌత్ క్యాంపస్ వద్ద శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పచ్చజెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయభావంతో మెలగాలని, ఉన్నతంగా చదివి విశ్వవిద్యాలయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకరావాలని సూచించారు. జిల్లా సంఘటన బాధ్యుడు హర్షవర్దన్, ఏబీవీపీ నేతలు అనిల్‌రెడ్డి, స్వామి, శివ, డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, ప్రతినిధి నరేందర్ ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన వెంటనే రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 24న కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఫిబ్రవరి 22న
గురుకుల ప్రవేశ పరీక్ష
మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026ను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు డీసీవో విజయలలిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకులాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు 2026 జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు, క్రీడా సామగ్రితోపాటు ఐఐటీ, నీట్, సీయూ, ఈటీ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మెరిట్, రిజర్వేషన్ నిబంధన ప్రకారం ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయలలిత కోరారు.
దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం


