వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి
బాన్సువాడ : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ స త్తా చాటాలని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి సూ చించారు. ఆదివారం బాన్సువాడలోని శ్రీనివాస గా ర్డెన్‌లో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుదారులు ఏడుగురు సర్పంచులుగా, ఆరుగురు ఉపసర్పంచులు గా, 29 మంది వార్డు సభ్యులుగా గెలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి, పార్టీని మరింత పటిష్టం చేయాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం రాజులు, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చీదరి సాయిలు, కార్యదర్శి శంకర్‌గౌడ్, నాయకులు గంగారెడ్డి, శ్రీనివాస్, హన్మండ్లు యాదవ్, లక్ష్మీనారాయణ, మక్కన్న, సాయిలు, చిరంజీవి, ఉమేష్, సర్పంచ్‌లు హన్మండ్లు, రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


