ఎలక్ట్రీషియన్‌కు నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రీషియన్‌కు నోటీస్‌

Apr 30 2025 12:11 AM | Updated on Apr 30 2025 12:11 AM

ఎలక్ట

ఎలక్ట్రీషియన్‌కు నోటీస్‌

భిక్కనూరు: దక్షిణ కాశీ గా పేరొందిన భిక్కనూ రు శ్రీసిద్దరామేశ్వరాల యం హుండీ లెక్కింపు లో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్‌ బి.లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్‌ జారీ చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్‌ తెలిపారు. ‘హుండీ లెక్కింపులో ఉ ద్యోగి చేతివాటం’ శీర్షికన ‘సాక్షి’లో మంగళ వారం ప్రచురితమైన వార్తపై గ్రామస్తులు స్పందించారు. సింగిల్‌ విండో చైర్మన్‌ గంగళ్ల భూమయ్య, నేతలు మైపాల్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నీల అంజయ్య, నర్మల రాంచంద్రం, ద్యాగల కిరణ్‌, సుధాకర్‌, జనార్దన్‌రెడ్డి ఆలయానికి వెళ్లి ఈవో శ్రీధర్‌తో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను చూపించాలని పట్టుబట్టారు. చేతివాటం ప్రధర్శించిన ఉద్యోగిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డి మాండ్‌ చేశారు. దీంతో ఈవో శ్రీధర్‌ మాట్లాడుతూ సీసీ ఫుటేజీల కోసం టెక్నీషియన్‌ను పిలిపిస్తానన్నారు. ఎలక్ట్రీషియన్‌ లక్ష్మీనారాయణ వ్యవహారంపై ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్‌ జారీ చేశామన్నారు.

నేడు బాల్య వివాహాల నిరోధంపై

అవగాహన కార్యక్రమం

కామారెడ్డి టౌన్‌: బాల్య వివాహాల నిరోధంపై బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జస్ట్‌ ఫర్‌ రైట్‌ సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ గిరిజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ప్రజలు, పురోహితులు, వివిధ మతాలకు చెందినవారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

రేపటినుంచి అథ్లెటిక్స్‌ వేసవి శిబిరం

కామారెడ్డి టౌన్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాల మేరకు గురువారంనుంచి అథ్లెటిక్స్‌ వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు కోచ్‌ శివ గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేట మండలంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మే 30వ తేదీ వరకు కొనసాగే శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నీటికోసం నిధుల

కేటాయింపు

నాగిరెడ్డిపేట : రోజురోజుకు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక నిధులను కేటాయించింది. జిల్లాకు రూ. కోటి మంజూరయ్యాయి. జిల్లాలోని మొత్తం 536 గ్రామపంచాయతీల ఖాతాలలో నాలుగురోజుల క్రితం ఆ నిధులను జమ చేశారు. పంచాయతీ స్థాయినిబట్టి ఒక్కోదాని ఖాతాలో రూ.10 వేల నుంచి రూ.29 వేల వరకు జమయ్యాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా వీటిని పైపులైన్‌ లీకేజీలు, బోర్‌మోటార్‌ మరమ్మతులు వంటి అత్యవసర పనులకు వినియోగించాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు సరిపోవు. కానీ ఉన్న నిధులను సర్దుబాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతుండడంతో గ్రామాల్లో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తతం విడుదలైన నిధులు కొంత ఊరట ఇవ్వనున్నాయి. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సొసైటీకి తాళం

మాక్లూర్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొట్టుముక్కల గ్రామానికి చెందిన రైతులు మాక్లూర్‌ సొసైటీకి తాళం వేశారు. మంగళవారం ఉదయం సొసైటీకి చేరుకున్న రైతులు సిబ్బందిని బయటకి పంపి తాళం వేసి ధర్నా చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ శేఖర్‌ సొసైటీ చైర్మన్‌ బూరోల్ల అశోక్‌ను వెంటబెట్టుకుని సొసైటీ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఎలక్ట్రీషియన్‌కు నోటీస్‌ 
1
1/1

ఎలక్ట్రీషియన్‌కు నోటీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement