మరింత సులభంగా యూరియా సరఫరా
● బుక్ చేసుకుంటే రైతుల ఇంటికే బస్తాలు
● అధికారులు రైతులకు
అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: యూరియా సరఫరాను మరింత సు లభం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యా ప్‌ను ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. ఈ నెల 22వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త యాప్‌పై రైతు వేదికల్లో శిక్షణ కార్యక్రమాలు ఏ ర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని వ్య వసాయ అధికారులకు సూచించారు. రైతులు దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. యాప్ ద్వారా రైతులు తమకు నచ్చిన డీలర్‌ను ఎంచుకుని ఇంటి నుంచే యూరి యాను బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందని పేర్కొన్నారు. భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసు కుని సమీప డీలర్‌తోపాటు జిల్లాలోని ఏ ఇతర అ నుకూలమైన డీలర్ వద్దనైనా యూరియాను రైతు లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పట్టా పాస్‌పుస్తకం లేని రైతులు ఆధార్ నంబర్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏవో మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


