క్రీడారంగం అభివృద్ధికి కృషి
కామారెడ్డి క్రైం: క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన జిల్లాకు చెందిన క్రీడాకారులకు రూ.25 వేల చొప్పున చెక్కులను శనివారం తన చాంబర్‌లో కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన గోతి పరశురాం, కిన్నెర ఆనంద్, మలావత్ ఈశ్వర్ బంగారు పతకాలు సాధించి జిల్లాకు విశేష గుర్తింపు తీసుకొచ్చారన్నారు. వారు సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి అనిల్, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


