నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు
నిజాంసాగర్(జుక్కల్): వలసల నివారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టగా, కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడం సబబు కాదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్ మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపు తగదని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.


