చదువుతోనే బంగారు భవిష్యత్తు
నిజాంసాగర్(జుక్కల్):/ భిక్కనూరు/ పిట్లం/ పెద్దకొడప్‌గల్/మాచారెడ్డి /లింగంపేట: చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని పిల్లల చదువులకు తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం లాల్‌సింగ్ అన్నారు. శనివారం మండలంలోని అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్య అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పాఠశాలలో టీచర్లు చెప్పిన బోధన తీరును తల్లిదండ్రులు పిల్లలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో హెచ్‌ఎం ప్రసూనదేవి మాట్లాడారు. పిట్లం, పెద్దకొడప్‌గల్, మాచారెడ్డి, లింగంపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో ఫుడ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈఫుడ్ పెస్టివల్ సందర్భంగా తల్లిదండ్రులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకొచ్చారు.
చదువుతోనే బంగారు భవిష్యత్తు


