భరోసా ఉన్నట్టా? లేనట్టా?
కామారెడ్డి క్రైం: యాసంగి పనులు ప్రారంభమై పంటలు సాగు లోకి వచ్చినా, డిసెంబర్ ముగిసేందుకు వస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు వేసిన వాటికి మాత్ర మే భరోసా ఇస్తామని ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఓ సందర్భంలో అన్నారు. ఈమేరకు అధికారులకు సూచనలు కూడా ఇచ్చారు. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు ఆగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరిషత్, మున్నిపల్ ఎన్నికలకు వెళ్తే మళ్లీ ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని, తమకు ‘భరోసా’ లేకుండా పోతుందని రైతులు అంటున్నారు. పంట సాగు పెట్టుబడుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శాటిలైట్ సర్వే ఎప్పుడు చేస్తారో, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియక రైతులు నిరాశకు లోనవుతున్నారు. భరోసా సాయం సకాలంలో అందని పక్షంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేట్టు లేదని అంటున్నారు.
పంటలు వేసిన భూములకే భరోసా
గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకుని అమలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వా త మొదటగా యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేశారు. ఆ తర్వాత వానాకాలం నుంచి ఎకరానికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్నారు. రైతుబంధులో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరును రైతు భరోసాగా మార్చడంతోపాటు అనేక మార్పులు తీసుకువచ్చింది. రోడ్లు, గుట్టలు సాగు యోగ్యంగా లేని భూములు, వెంచర్లుగా మారిన భూములను గుర్తించి పథకంలో నుంచి తప్పించారు. గత యాసంగిలో 5 ఎకరాలలోపు భూములకే రైతుబంధు నిధులు జమయ్యాయి. ఈ సారి ఇంకా రైతు భరోసా ఊసే లేదు. సాగవుతున్న భూములను శాటిలైట్ ద్వారా గుర్తించి సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో యాసంగి పెట్టుబడి సాయం మరింత ఆలస్యం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 3,28,231 మంది రైతులు
గత ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఎన్నికల హామీ ప్రకారం గత యాసంగి నుంచి కాంగ్రేస్ ప్రభుత్వం సీజన్‌కు ఎకరానికి రూ.7.5 వేలు ఇవ్వాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా గత యాసంగి నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.6 వేలకు మాత్రమే పెంచింది. కామారెడ్డి జిల్లాలో తాజా లెక్కల ప్రకారం మొత్తం 3,28,231 మంది రైతులున్నారు. వారందరికీ పెట్టుబడి సాయం అందించాలంటే రూ.314 కోట్లు అవసరం ఉన్నాయి.
హెచ్‌ఎం నరహరితో ఆనందం పంచుకుంటూ..
రిజిస్టర్‌లో తన పేరు చూసుకుంటున్న పోచారం
సిజేరియన్‌లకే మొగ్గు..
సాధారణ కాన్పులు చేయాలని సాధ్యం కానిపక్షంలోనే సీజరియన్ చేయాలని ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. సాధారణ ప్రసవం అయితే ఒక రోజు మాత్రమే అడ్మిట్ చేసుకుని సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు బిల్లు వసూలు చేస్తున్నారు. అదే సీజరియన్ చేస్తే వారంపాటు అడ్మిట్ చేసుకుని సుమారు రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పైగా బిల్లు వసూలు చేస్తున్నారు. అన్ని చార్జీలతో భారీ మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉండడంతో సిజేరియన్‌లకే ప్రైవేట్ ఆస్పత్రులు మొగ్గుచూపుతున్నాయి.
ఇప్పటికే సాగులోకి వచ్చిన
యాసంగి పంటలు
శాటిలైట్ సర్వేతో సాగవుతున్న
భూములకే ఇస్తామంటున్న ప్రభుత్వం
పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్న రైతులు
భరోసా ఉన్నట్టా? లేనట్టా?


