బేస్‌మెంట్ దశలో నిలిచిన మరుగుదొడ్ల నిర్మాణం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం జెడ్పీహైస్కూల్‌లో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిర్మించ తలపెట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. 180మంది విద్యార్థులున్న ఈపాఠశాలలో ఒకే ఒక మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది పూర్తి కావస్తున్న టాయిలెట్ల నిర్మాణం పూర్తికావడం లేదు. అధికారులు బిల్లు నమోదు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులను బేస్‌మెంట్ దశలో నిలిపివేశారు. వచ్చే విద్యాసంవత్సరం వరకు టాయిలెట్ల నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


