ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి 108 ఫిర్యా దులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత ఫిర్యాదు లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. వాటిని పరిస్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. ధరణి ఫైళ్లు ఆన్‌లైన్‌లో మాత్రమే వస్తున్నాయనీ, తహసీల్దార్లు మ్యానువల్ ఫైళ్లను పంపడం లేదని, వెంటనే పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూద్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
ప్రజావాణికి 108 వినతులు


