పీఎం మన్‌కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఆదివారం ప్రధాన మంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు టీవీ లో వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, పట్టణ ఉపాధ్యక్షుడు రజినీకాంత్ రావు, 12 వార్డు బూత్ అధ్యక్షుడు గోపాల్, రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు తుమ్మ బాలకిషన్, నాయకులు రవీందర్, గోవర్ధన్, దొడ్ల స్వామి, రజినీకాంత్, ప్రభాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
4న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మే 4 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రికెట్ శిబిరం నిర్వహించనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా క్రికెట్ అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు మోజామ్ అలీఖాన్, ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిబిరం ఉంటుందని పేర్కొ న్నారు. 13 నుంచి 23 ఏళ్లలోపువారు అర్హుల ని తెలిపారు. క్రీడాకారులు తెల్లని క్రికెట్ దు స్తులు, క్యాన్వస్ షూస్, క్రికెట్ కిట్ వెంట తీసుకొని రావాలని, వివరాలకు 96666 77786లో సంప్రదించాలని సూచించారు.
చిన్నారిని బలిగొన్న కూలర్
మాక్లూర్ : కూలర్ షా క్‌తో చిన్నారి మృతి చెందిన ఘటన చిక్లి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిక్లికి చెంది న గడ్డం అర్చన, నవీన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అసెంబుల్డ్ ఐరన్ కూలర్ వద్ద తల్లిదండ్రులతోపాటు పెద్దకూతురు విహంకిత(5) నిద్రపోయింది. సుమారు 2 గంటల సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న విహంకిత అకస్మాత్తుగా పక్కనే ఉన్న కూలర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇంటి దర్వాజ నుంచి వాకిట్లో పడిపోయింది. ఇంటి ఎదుట రహదారి గుండా వెళ్లేవారు గమనించి తల్లిదండ్రులకు తెలపడంతో విహంకితను వెంటనే జన్నేపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
పీఎం మన్‌కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు


