వర్షం కోసం వింత ఆచారం | - | Sakshi
Sakshi News home page

వర్షం కోసం వింత ఆచారం

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

అగళి: వరుణుడి కరుణ కోసం గ్రామాల్లో వింత ఆచారాలను పాటిస్తున్నారు. కప్పలు, గాడిదల పెళ్లిళ్లు, ఊరి నుంచి వలస వెళ్లడం, బండరాయిపై నైవేద్యాన్ని నాలుకతో నాకడం లాంటివి చేస్తుంటారు. ఇందులో భాగంగానే అగళి మండలం నరసంబూదిలో ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పిల్లలు చెరువులోని మట్టిని సేకరించి దాన్ని విగ్రహంగా తయారు చేశారు. గ్రామంలోని ఇంటింటికీ వరుణ దేవుడు (మండ్రయ) విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతిమ ఎత్తుకున్న వారిపై నీరు పోసి ధాన్యాన్ని సేకరించారు. కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చెట్టు కింద కొలువుదీర్చి ధాన్యంతో భోజనాలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

మట్టి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్న పిల్లలు

Advertisement
 
Advertisement
Advertisement