పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో సామాన్యులపై పెను భారం పడుతుంది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై ఒకే సారి రూ.3కు పైగా పెంచడం దారుణం.దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో ఇంధన ధరలు ఉండడం సిగ్గుచేటు. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పోల్చితే ఏపీలో భారం అధికమైంది. రాష్ట్రంలో సామాన్యుడు జీవించలేని పరిస్థితి దాపురించింది.
– వేమనారాయణ, రైతు సంఘం నాయకుడు, పుట్టపర్తి
రైతుకు కోలుకోలేని దెబ్బ
ఇంధన ధరల పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్ని పనులూ యంత్రాలతోనే చేస్తుండడంతో ట్రాక్టర్ బాడుగ నుంచి మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వరకూ అన్ని ధరలూ పెరుగుతాయి. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు.
– క్రిష్ణారెడ్డి, రైతు, చౌటకుంట పల్లి, నల్లమాడ మండలం


